Published : 07/11/2021 22:04 IST

WhatsApp Community: వాట్సాప్‌ కమ్యూనిటీ.. అడ్మిన్ అధికారాలివే!

 

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్దిరోజుల క్రితం వాట్సాప్ ‘కమ్యూనిటీస్‌’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం వాట్సాప్‌లో ఉన్న గ్రూప్స్‌ ఫీచర్‌కి భిన్నంగా ఇందులో కొత్త వాటిని పరిచయం చేస్తారని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ఈ ఫీచర్‌ గ్రూప్‌ అడ్మిన్స్‌కి మరిన్ని అదనపు ఫీచర్లను ఇస్తుందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. అలానే ఒక కమ్యూనిటీలో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవడంతోపాటు వాటికి ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందని తెలిపింది. దాంతోపాటు కమ్యూనిటీలకు అడ్మిన్‌గా ఉన్నవాళ్లు కమ్యూనిటీలో ఉన్న అన్ని గ్రూప్స్‌లోకి కూడా మెసేజ్‌లు పంపొచ్చు. గ్రూప్స్‌లోలానే కమ్యూనిటీ అడ్మిన్‌లు ఇతరులను ఇన్వైట్‌ లింక్‌, క్యూఆర్‌ కోడ్ లేదా మాన్యువల్‌గా కమ్యూనిటీలలోకి ఆహ్వానించవచ్చు. అయితే, కమ్యూనిటీలోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూప్‌లకు మెసేజ్‌ పంపలేరు. కమ్యూనిటీ సభ్యులకు ఇతర సభ్యులతో సంభాషించాలా.. వద్దా.. అనేది కమ్యూనిటీ అడ్మిన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

వాబీటాఇన్ఫో పేర్కొన్న వివరాల ప్రకారం.. కమ్యూనిటీ ఐకాన్‌లు చతురస్రాకారంగా ఉండి నాలుగు వైపులా రౌండ్ ఎడ్జ్‌లు ఉంటాయని సమాచారం. అలానే కమ్యూనిటీలలోని గ్రూపులకు వేర్వేరు చాట్ ఐకాన్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. కమ్యూనిటీ ఫీచర్ ద్వారా సమాచారాన్ని వాట్సాప్ యూజర్స్ ఎక్కువమందితో పంచుకోగలరని వాబీటా పేర్కొంది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్రూప్స్‌ ఫీచర్‌ను తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే వాట్సాప్ అధికారికంగా ప్రకటన చేసేవరకు వేచిచూడాల్సిందే. ఇటీవలే వాట్సాప్ కొత్త మల్టీడివైజ్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని సాయంతో ఒకే సారి నాలుగు వేర్వేరు డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని