Published : 29/11/2021 17:36 IST

Motorola G31: మాల్‌వేర్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో మోటో కొత్త ఫోన్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: మోటోరోలా కంపెనీ జీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో జీ31 పేరుతో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. గతంలో విడుదల చేసిన మోటో జీ30కి కొనసాగింపుగా మోటోరోలా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. మరి జీ31లో ఎలాంటి ఫీచర్లున్నాయి? ధరెంత? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభకానున్నాయనే విషయాలు చూద్దామా..!

మోటో జీ31 ఫీచర్లు

మోటో జీ31 ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఉపయోగించారు. గేమింగ్ ప్రియుల కోసం ఏఆర్‌ఎమ్‌ మలి-జీ52 ఎమ్‌సీ2 గ్రాఫిక్‌ కార్డ్ ఇస్తున్నారు. జీ31లో నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో సెన్సార్‌ కెమెరాలున్నాయి. ముందు భాగంలో 13 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

మాల్‌వేర్‌, ఫిషింగ్‌తోపాటు ఇతర సైబర్‌ దాడుల నుంచి కాపాడేందుకు ఈ ఫోన్‌లో థింక్‌షీల్డ్‌ సెక్యూరిటీతో రక్షణ కల్పిస్తున్నారు. నీటి తుంపరలు పడినా పాడవకుండా వాటర్‌ రెసిస్టెంట్ ప్రొటెక్షన్‌ ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ టర్బోపవర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 36 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని మోటోరోలా చెబుతోంది.

మోటోరోలా జీ31 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్‌+64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,999. 6 జీబీ ర్యామ్‌+128 జీబీ వేరియంట్‌ ధర రూ. 14,999.  డిసెంబరు 6 నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. బేబీ బ్లూ, మెటియోరైట్ గ్రే రంగుల్లో లభిస్తుంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని