తెలుగులోనూ క్లబ్‌హౌజ్‌

సోషల్‌ ఆడియో యాప్‌ క్లబ్‌హౌజ్‌ ఇకపై తెలుగులోనూ కనువిందు చేయనుంది. స్థానికులకు మరింత చేసే ప్రయత్నంలో భాగంగా ఇందులో కొత్తగా 13 భాషలను జోడించారు.

Published : 10 Nov 2021 00:56 IST

సోషల్‌ ఆడియో యాప్‌ క్లబ్‌హౌజ్‌ ఇకపై తెలుగులోనూ కనువిందు చేయనుంది. స్థానికులకు మరింత చేసే ప్రయత్నంలో భాగంగా ఇందులో కొత్తగా 13 భాషలను జోడించారు. వీటిల్లో ఐదు భారతీయ భాషలు- తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం ఉన్నాయి. ఇప్పటివరకు క్లబ్‌హౌజ్‌ ఒక్క ఇంగ్లిషునే సపోర్టు చేస్తుండేది. చాలా దేశాల ప్రజలు క్లబ్‌హౌజ్‌లో పాలు పంచుకుంటున్న నేపథ్యంలో స్థానిక భాషలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సంకల్పించారు. దీంతో ఇది మరింత విస్తృతం కావటానికి మార్గం సుగమైంది. ఐదు భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇండోనేషియన్‌, ఇటాలియన్‌, జపనీస్‌, కొరియన్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంటుంది. యాప్‌ ఐకాన్‌ మీద తొలిసారిగా ఒక భారతీయుడికి కూడా అవకాశం దక్కటం గమనార్హం. ముంబయికి చెందిన గాయకుడు అనిరుధ్‌ దేశ్‌ముఖ్‌ దీని ఐకాన్‌గా కనిపించనున్నారు. సాధారణంగా క్లబ్‌హౌజ్‌ తరచూ ఐకాన్లను మారుస్తుంటుంది. యాప్‌ వాడకాన్ని ప్రోత్సహించటానికి తమ వినియోగదారుల ఫొటోలనే ఇందుకు ఎంచుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని