ష్‌.. ష్‌.. అతి నిశ్శబ్దం!

ప్రపంచంలో అతి నిశ్శబ్దమైన గది ఎక్కడుందో తెలుసా? అమెరికాలో వాషింగ్టన్‌లోని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రధాన కార్యాలయం అడుగున. దీని లోపల చప్పుడు నెగెటివ్‌ డెసిబెల్స్‌లో.. అంటే -20.6 డెసిబెల్స్‌లో ఉంటుంది. ఒకరకంగా దీన్ని గదుల లోపలి గది అనుకోవచ్చు.

Updated : 10 Nov 2022 11:08 IST

ప్రపంచంలో అతి నిశ్శబ్దమైన గది ఎక్కడుందో తెలుసా? అమెరికాలో వాషింగ్టన్‌లోని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రధాన కార్యాలయం అడుగున. దీని లోపల చప్పుడు నెగెటివ్‌ డెసిబెల్స్‌లో.. అంటే -20.6 డెసిబెల్స్‌లో ఉంటుంది. ఒకరకంగా దీన్ని గదుల లోపలి గది అనుకోవచ్చు. ఉల్లిగడ్డ మాదిరిగా ఆరు పొరల కాంక్రీటుతో దీన్ని నిర్మించారు. ప్రత్యేకమైన అమరికతో కూడిన దీనిలోని గోడలు లోపలికి చప్పుడు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. మన గుసగుస తీవ్రత 30 డెసిబెల్స్‌. శ్వాస తీసుకుంటున్నప్పుడు అయ్యే చప్పుడు 10 డెసిబెల్స్‌. వీటితో పోలిస్తే అక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మన చెవుల కనిష్ఠ వినికిడి పరిమితి 0 డెసిబెల్స్‌. మనకు వినిపించనంత మాత్రాన ఎలాంటి శబ్దాలు లేవనుకోవద్దు. సున్నా డెసిబెల్స్‌ కన్నా తక్కువ.. అంటే నెగెటివ్‌ స్థాయిలోనూ చప్పుడు అవుతుంది. అతి నిశ్శబ్ద గదిలోకి వెళ్లి కాసేపు శ్వాస తీసుకోవటం ఆపితే మన గుండె చప్పుడు, రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తున్న చప్పుడూ వినిపిస్తుంది. భవిష్యత్‌ తరం పరికరాలను మరింతగా మెరుగుపరచటానికి ఈ గదిని నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని