Akhanda: మహేశ్‌.. ప్రభాస్‌.. ఎన్టీఆర్‌ అందరూ ‘భం.. అఖండ’

AkhandaBGM: ‘అఖండ’కు తమన్‌ అందించిన సంగీతానికి సోషల్‌మీడియాలో మీమ్స్‌ ఇవే...

Updated : 24 Jan 2022 11:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లక్ష ఢమరుకాలు ఒకేసారి మోగితే.. వెయ్యి పిడుగులు ఒకేసారి పడితే.. వంద అణుబాంబులు ఒకేసారి పేలితే.. ఎలా ఉంటుందో తెలియదు గానీ, బహుశా ‘అఖండ’ నేపథ్య సంగీతంలా ఉంటుందేమో. థియేటర్‌లో ‘అఖండ రుద్ర సికిందర్‌ అఘోర’గా బాలకృష్ణ వస్తుంటే, అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. అందుకు కారణం బోయపాటి టేకింగ్‌, బాలకృష్ణ ఆహార్యం ఒక ఎత్తైతే తమన్‌ నేపథ్య సంగీతం మరో ఎత్తు. ఆ ప్రళయకాల రుద్రుడు శివుడేమైనా తమన్‌ను ఆవహించాడా? అన్న రీతిలో థియేటర్లు దద్దరిల్లిపోయేలా సంగీతం అందించాడు. ఇప్పుడు ‘అఖండ’ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో తమన్‌ నేపథ్య సంగీతాన్ని తీసుకుని అదిరిపోయే మీమ్స్‌తో నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు. మహేశ్‌.. ప్రభాస్‌.. ఎన్టీఆర్‌ నటించిన సన్నివేశాలు ‘భం.. అఖండ’ అంటూ చూస్తుంటే సరికొత్తగా ఉంది. ఇక తమన్‌ ఫొటోతో చేసిన రీమిక్స్‌కు ఆయన కూడా ఫిదా అయ్యారు. ‘బ్రో.. నా టీషర్టులో తలపెట్టుకుని దీన్ని చూశాను. వామ్మో.. చాలా బలం కావాలి..’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆ వీడియోలను మీరూ చూసేయండి..

 



























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని