ప్రేక్షకులతో మీసం తిప్పించేలా..!

నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాడు మళ్లీ వచ్చాడు.. అన్నది ఉపశీర్షిక. కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కించారు. నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటించగా.. చైతూకు జోడీగా కృతిశెట్టి కనిపించింది. ఈ సినిమా

Published : 15 Jan 2022 02:31 IST

నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాడు మళ్లీ వచ్చాడు.. అన్నది ఉపశీర్షిక. కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కించారు. నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటించగా.. చైతూకు జోడీగా కృతిశెట్టి కనిపించింది. ఈ సినిమా ప్రచార వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘‘పక్కా సంక్రాంతి చిత్రమిది. దీన్ని పండక్కి తీసుకురావాలని నేనెంత పట్టుబట్టానో.. నా టీమ్‌ అంతకంటే ఎక్కువ పట్టుబట్టింది. ఈ చిత్రంలో నేను, చైతూ మీసం తిప్పాం. ప్రేక్షకులతోనూ మీసం తిప్పించేలా ఉంటుందీ సినిమా. మాకింత అద్భుతమైన స్క్రిప్ట్‌ ఇచ్చిన కల్యాణ్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘కచ్చితంగా అందరికీ నచ్చే చిత్రమిది’’ అన్నారు హీరో నాగచైతన్య. దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘నాగార్జున నమ్మకం వల్లే ఈ సినిమా సాధ్యమైంది. ఆయన లేకపోతే ఇంత పెద్ద సినిమా ఇంత తక్కువ సమయంలో తీసుకురావడం చాలా కష్టం. బంగార్రాజు పాత్ర ఆయన కోసమే పుట్టింది. చైతన్య ఇందులో అద్భుతంగా చేశారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దక్ష నగార్కర్‌, దర్శన, అనసూయ, అనూప్‌ రూబెన్స్‌, జునైద్‌, యువరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని