Omicron: ‘సోట్రోవిమాబ్‌’కు బ్రిటన్‌ ఆమోదం.. ఒమిక్రాన్‌పై పనిచేస్తుందన్న సంస్థ

కొవిడ్‌ లక్షణాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉన్న బాధితుల చికిత్స కోసం గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే) ఉత్పత్తి చేసిన ‘సోట్రోవిమాబ్‌’ను బ్రిటన్‌ గురువారం ఆమోదించింది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పైకూడ ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మోనోక్లోనల్‌...

Updated : 02 Dec 2021 18:16 IST

లండన్‌: కొవిడ్‌ లక్షణాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉన్న బాధితుల చికిత్స కోసం గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే) ఉత్పత్తి చేసిన ‘సోట్రోవిమాబ్‌’ను బ్రిటన్‌ గురువారం ఆమోదించింది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పైకూడ ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మోనోక్లోనల్‌ యాంటీబాడీ డ్రగ్‌ ఒక డోసు..కరోనా బాధితులు ఆసుపత్రిలో చేరడం, మరణించే ప్రమాదాన్ని 79 శాతం తగ్గించినట్లు తేలిందని బ్రిటన్‌ మెడికల్‌ రెగ్యులేటరీ మెడిసిన్స్, హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్‌ఆర్‌ఏ) తెలిపింది.

ఇతర కణాల్లోకి చేరకుండ అడ్డగింత..

ఈ రోజు వరకు డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన అన్ని వేరియంట్లపై సోట్రోవిమాబ్ ప్రభావం చూపినట్లు జీఎస్‌కే పేర్కొంది. ఒమిక్రాన్‌ కీలక మ్యుటేషన్లకూ వ్యతిరేకంగా పనిచేసినట్లు ప్రీ క్లినికల్ డేటాలో వెల్లడైందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై పూర్తిస్థాయి నిర్ధారణకుగానూ పరీక్షలు చేపడుతున్నామని, ఈ ఏడాది చివరి నాటికి ఫలితాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌.. కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రోటీన్‌ను శరీరంలోని ఇతర కణాల్లోకి చేరకుండా అడ్డుకుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని