Updated : 25/11/2021 13:43 IST

Corona Virus: గాలి తుంపర్లతో కలిసి 3 మీటర్లకు పైగా కరోనా వైరస్‌ ప్రయాణం

టీకా, మాస్కులతో మహమ్మారి నుంచి రక్షణ
 హెచ్చరించిన ‘కేంబ్రిడ్జ్‌’ పరిశోధకులు

లండన్‌: ‘అన్ని జాగ్రత్తలూ పాటించా. ఇతరులకు దూరంగానే ఉన్నా. అయినా నాకు కరోనా ఎలా సోకిందబ్బా!’ అని దీర్ఘాలోచనలో పడినవారికి కొత్త సమాధానంతో ముందుకొచ్చారు... కేంబ్రిడ్స్‌ యూనివర్సీటీ పరిశోధకులు. ఇతరులకు రెండు మీటర్ల దూరంలో ఉన్నంత మాత్రాన కరోనా సోకదన్న గ్యారెంటీ ఏమీ లేదని తేల్చేశారు. కరోనా వైరస్‌తో కూడిన తుంపర్లు గాలిలో ప్రయాణిస్తూ అంతకు మించిన దూరంలో ఉన్నవారిని కూడా చేరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మాస్కు ధరించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని సూచించారు. కరోనా బాధితులు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా, చీదినా, ఆవలించినా వారి నోటి నుంచి కరోనా వైరస్‌తో కూడిన గాలి తుంపర్లు విడుదలవుతాయి. ఇవి వివిధ గమనాల్లో ఇష్టారీతిన గాలిలో ప్రయాణిస్తాయి. ఇవి సుమారు రెండు మీటర్ల దూరంలోని వ్యక్తులను చేరుకుంటాయని ఇదివరకు పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, ఇదే సురక్షిత దూరమని కచ్చితంగా చెప్పలేమని, మూడు మీటర్లకు మించి కూడా ఈ తుంపర్లు ప్రయాణించవచ్చని భారత సంతతికి చెందిన పరిశోధనకర్త డా.శ్రేయ్‌ త్రివేది పేర్కొన్నారు. ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ పత్రిక ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపింది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని