Delta: చైనాకు ‘వుహాన్‌ రోజులను’ గుర్తుకు తెప్పిస్తున్న డెల్టా..!

చైనాలో కరోనావైరస్‌ డెల్టా వేరియంట్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. వుహాన్లో తొలిసారి వైరస్‌ను గుర్తించిన నాటి నుంచి ఈ స్థాయిలో ఎప్పుడూ పోరాడలేదు. వైరస్‌ వ్యాప్తి కట్టడికి కఠిన  నిబంధనలు విధించినప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదు.

Updated : 03 Nov 2021 19:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో కరోనావైరస్‌ డెల్టా వేరియంట్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. వుహాన్‌లో తొలిసారి వైరస్‌ను గుర్తించిన నాటి నుంచి ఈ స్థాయిలో ఎప్పుడూ పోరాడలేదు. వైరస్‌ వ్యాప్తి కట్టడికి కఠిన  నిబంధనలు విధించినప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదు. ఇప్పటికే మొత్తం 31 ప్రావిన్సుల్లో 19 చోట్ల ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు. తాజాగా చాంగ్‌క్వింగ్‌,హెనాన్‌,జియాంగ్సు ప్రావిన్సుల్లో కలిపి 93 కొత్త కేసులను గుర్తించారు. 

కొవిడ్‌ వ్యాప్తిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు  చైనా అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో కొవిడ్‌ను నిర్మూలించాలంటే కఠిన నిబంధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. తాజాగా బీజింగ్‌లో కూడా తొమ్మిది కేసులు బయటపడ్డాయి. దీంతో  ఈ నగరంలో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. గత జనవరి, ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో  కేసులు రావడం ఇదే తొలిసారి.  ఇక్కడ ఒక పాఠశాల టీచర్‌లో డెల్టా వేరియంట్‌ను కనుగొన్న తర్వాత రెండు స్కూళ్లలోని విద్యార్థులను క్వారంటైన్‌కు తరలించారు. షాంఘై డిస్నీ ల్యాండ్‌లో ఒకరికి కొవిడ్‌ సోకినట్లు తేలడంతో దాదాపు 30 వేల మందిని ఓ పార్కులో ఉంచి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని నెలల్లోనే చైనా ఈ అవుట్‌ బ్రేక్‌ను పూర్తిగా నిర్మూలిస్తుందని చైనా ఆరోగ్యశాఖ అధికారి ఝాంగ్‌ నాన్షన్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని