Vijayawada: అత్యవసర చికిత్సకు.. వాట్సాప్‌ గ్రూప్‌..!

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవరసర చికిత్స కోసం వచ్చే రోగులకు వెంటనే వైద్యం అందించేందుకు..

Updated : 20 Feb 2022 06:39 IST

విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు వెంటనే వైద్యం అందించేందుకు.. అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అంబులెన్స్, ఆసుపత్రి సిబ్బందితో కలిసి వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ముందు.. వారి వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ వివరాలకు అనుగుణంగా బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు.. సంబంధిత వైద్యులు సిద్ధంగా ఉంటారని.. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. బాధితులకు సంబంధించి సమాచారం లేకపోవడంతో వైద్యం అందడం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువని ఆయన పేర్కొన్నారు. అంబులెన్స్, ఆసుపత్రి సిబ్బంది సమన్వయంతో పనిచేయడం ద్వారా.. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని