logo
Published : 01/12/2021 06:11 IST

నిధులెలా మళ్లిస్తారు


వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్ల నిధులను ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు మళ్లించిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టాయి. వర్సిటీలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా మంగళవారం సమావేశమై సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి పోరాటం చేయాలని నిర్ణయించాయి.విశ్వవిద్యాలయం ప్రధానద్వారం ఎదుట బైౖఠాయించి నిరసన తెలిపారు. నిధులు వెనక్కి రాబట్టేందుకు పోరాటం చేస్తామని ప్రకటించారు. వర్సిటీ అభివృద్ధిని, ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాలని రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. భవిష్యత్తులో పరీక్షలు, కౌన్సెలింగు నిర్వహించాలన్నా నిధులు కొరత ఉంటుందని ఉద్యోగ సంఘం ప్రతినిధులు అక్కిరాజు, నరసింహారావు పేర్కొన్నారు.

ఐకాస ఏర్పాటు: ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న విశ్వవిద్యాలయం ఉద్యోగ సంఘాలు మంగళవారం ఐకాసగా ఏర్పడ్డాయి. ఛైర్మన్‌గా వి.వి.నారాయణ, కో-ఛైర్మన్లుగా జె.సుసన్న, కె.నరసింహారావు, కన్వీనరుగా జి.వాసు, కో-కన్వీనర్లుగా టి.పోతురాజు, ఎం.వి.అక్కిరాజు, సభ్యులుగా అంబేడ్కర్‌, బి.శివరామకృష్ణ, పి.రవి ప్రసాద్‌, ఎం.శ్రీనివాసరెడ్డి, జి.స్వరూపరాణి, డి.వి.రమణమూర్తి, డి.రామకృష్ణ, కె.రాజేంద్ర బాబు, టి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, ఆర్‌.వి.ఎన్‌.ప్రసాద్‌ నియమితులయ్యారు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని