logo
Published : 01/12/2021 06:11 IST

శ్రీనివాసులు సేవలు అభినందనీయం


శ్రీనివాసులుకు దేవుని చిత్రపటాన్ని అందజేస్తున్న మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : నగర పోలీస్‌ కమిషనర్‌గా బత్తిన శ్రీనివాసులు చేసిన సేవలు అభినందనీయమని పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు కొనియాడారు. మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శ్రీనివాసులకు వీడ్కోలు సభ నిర్వహించారు.  రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,  జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు, జోగి రమేష్‌, కైలే అనిల్‌కుమార్‌, దూలం నాగేశ్వరరావు, రక్షణనిధి, వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్‌, మల్లాది విష్ణు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి తదితరులు సీపీని సత్కరించారు. సంయుక్త కలెక్టర్లు కె.మాధవీలత, కె.మోహన్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌,  సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌ చంద్‌, డీపీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, బందరు ఆర్డీవో ఖాజావలి, డీసీపీ హర్షవర్ధన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

సంస్కరణలు కొనసాగిస్తా: పాలరాజు
విజయవాడ సిటీ: విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బత్తిన శ్రీనివాసులు ప్రవేశపెట్టిన సంస్కరణలతో  నేరాల సంఖ్య తగ్గడంతో పాటు రాష్ట్రంలోనే విజయవాడ పోలీస్‌ సేవలను అగ్రస్థానంలో నిలిపారని, వాటిని  కొనసాగిస్తూ ముందుకెళతామని ఇన్‌ఛార్జి సీపీ జి.పాలరాజు అన్నారు. కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్‌ అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం పాలరాజు మాట్లాడుతూ పోలీసింగ్‌ను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుని మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని