logo
Published : 01/12/2021 06:11 IST

అపార్ట్‌మెంట్‌లో చోరీ

చిట్టినగర్‌, న్యూస్‌టుడే : పాలఫ్యాక్టరీ సమీపంలోని చనమోలు వెంకట్రావు వంతెన పక్కనే ఓ అపార్టుమెంట్‌లో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంటి తలుపులు పగులగొట్టి బంగారం, నగదు దొంగిలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. భోగాల శ్రావణి, అనిల్‌కుమార్‌ దంపతులు చిట్టినగర్‌, రామాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. శ్రావణి తల్లిదండ్రులు చనమోలు వెంకట్రావు వంతెన దిగువలో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. 2019లో శ్రావణి తండ్రి చనిపోయాడు. దీంతో ఇంటికి తాళం వేసి ఆమె వద్దే తల్లి ఉంటోంది. అప్పుడప్పుడు వెళ్లి ఇల్లు శుభ్రం చేసి వస్తుండేది. నవంబరు 27న కూడా శుభ్రం చేసి ఇంటికి తాళం వేసి వచ్చారు. 30న శ్రావణి తన తల్లి కలిసి ఇంటికి వెళ్లారు. బయట ఇనుప గేటుకు వేసిన తాళం తీయడంతోపాటు తలుపు గడియ విరగ్గొట్టి ఉంది. ఆందోళనగా లోపలకు వెళ్లి చూడగా బీరువా తెరచి దుస్తులు మంచంపై చిందర వందరగా పడేసి ఉన్నాయి. బంగారం వస్తువులు, నగదు, వెండి వస్తువులు, స్థలాలకు సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. నేరవిభాగం పోలీసులు, క్లూస్‌ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చీరలో పెట్టిన రూ.లక్ష నగదు ఉంది. కొన్ని బంగారు, వెండి వస్తువులు ఉన్నాయి, 16 గ్రాముల విలువైన బంగారు లాకెట్లు-3, చెవి దిద్దులు జత, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు తేలింది. శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నేర విభాగం ఎస్సై రాజనరేంద్ర తెలిపారు.

చెడ్డీగ్యాంగ్‌ పనేనా?
కాగా చోరీ జరిగిన అపార్టుమెంటులోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లో ఇద్దరు వ్యక్తులు ధోవతి కట్టుకుని, బనియన్లు ధరించి ఉన్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెడ్డీగ్యాంగ్‌ నగరంలోకి ప్రవేశించిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపార్టుమెంటులో చోరీకి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్‌ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దర్యాప్తు చేపట్టామని, నిందితులు దొరికితేగానీ ఏ గ్యాంగ్‌ అనేది తేలుతుందని సీఐ మోహన్‌రెడ్డి చెప్పారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని