logo
Published : 01/12/2021 05:44 IST

ఆర్టీసీలో ఎన్నికల సందడి

విజయవాడ, న్యూస్‌టుడే

ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనమై ప్రజా రవాణా శాఖ (పీటీడీ)గా మారిన తరువాత ఆ సంస్థలో తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఉద్యోగులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఏర్పాటు చేసిన కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌)కి ఎన్నికలు జరగనున్నాయి. చివరిసారి 2016లో ఎన్నిక నిర్వహించారు. ఐదేళ్ల తరువాత జరుగుతున్న ఎన్నికను సంఘాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. నామపత్రాల స్వీకరణ సోమవారం నుంచి అన్ని డిపోల్లో ప్రారంభమైంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సంఘాలు సిద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌, వైఎస్‌ఆర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, యునైటెడ్‌ వర్కర్స్‌, సీఐటీయూ అనుబంధ సంఘాలు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లాలోని 14 డిపోల్లో సీసీఎస్‌ సభ్యుల ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది.

* కృష్ణా జిల్లాలో విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి ముగ్గురిని, గవర్నర్‌పేట-1 నుంచి ఇద్దరు, గవర్నర్‌పేట-2 నుంచి ఇద్దరు, ఇబ్రహీంపట్నం నుంచి ఇద్దరు, విద్యాధరపురం డిపో నుంచి ముగ్గురు, మిగిలిన డిపోల నుంచి ఒకరు చొప్పున ప్రతినిధుల్ని సభ్యులు ఎన్నుకోనున్నారు. కృష్ణాలో 5,919 మంది పీటీడీ ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొంటారు.

ఓటర్ల వివరాలు
విజయవాడ రీజనల్‌ కార్యాలయంలో 153 మంది, కంట్రోలర్‌ అండ్‌ స్టోర్స్‌లో 48, టైర్‌ రిట్రేడింగ్‌ షాపులో 43, జోనల్‌ వర్కుషాపులో 123 మందికి ఓటు హక్కు ఉంది. విజయవాడ పీఎన్‌బీఎస్‌ డిపోలో 641, గవర్నర్‌పేట-1లో 447, గవర్నర్‌పేట-2లో 549, ఆటోనగర్‌ 296, ఇబ్రహీంపట్నం 399, విద్యాధరపురం 658, గన్నవరం 320, గుడివాడ 353, జగ్గయ్యపేట 309, మచిలీపట్నం 354, నూజివీడు 289, అవనిగడ్డ 365, తిరువూరు 288, ఉయ్యూరు డిపోలో 314 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు.


సత్తెనపల్లి, న్యూస్‌టుడే

ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనమై ప్రజా రవాణా శాఖ (పీటీడీ)గా మారిన తరువాత ఆ సంస్థలో తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఉద్యోగులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఏర్పాటు చేసిన కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌)కి ఎన్నికలు జరగనున్నాయి.  చివరిసారి 2016లో ఎన్నిక నిర్వహించారు. ఐదేళ్ల తరువాత జరుగుతున్న ఎన్నికను సంఘాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. నామపత్రాల స్వీకరణ  సోమవారం నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అన్ని డిపోల్లో ప్రారంభమైంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌, వైఎస్‌ఆర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, యునైటెడ్‌ వర్కర్స్‌, సీఐటీయూ అనుబంధ సంఘాలు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లాలో 13, కృష్ణాలో 14 డిపోల్లో సీసీఎస్‌ సభ్యుల ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది.

* గుంటూరు-1, 2, చిలకలూరిపేట, తెనాలి, వినుకొండ డిపోల నుంచి ఇద్దరిని, మిగిలిన డిపోల నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. కృష్ణా జిల్లాలో విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి ముగ్గురిని, గవర్నర్‌పేట-1 నుంచి ఇద్దరు, గవర్నర్‌పేట-2 నుంచి ఇద్దరు, ఇబ్రహీంపట్నం నుంచి ఇద్దరు, విద్యాధరపురం డిపో నుంచి ముగ్గురు, మిగిలిన డిపోల నుంచి ఒకరు చొప్పున ప్రతినిధుల్ని సభ్యులు ఎన్నుకోనున్నారు. గుంటూరు జిల్లాలో 4,671 మంది, కృష్ణాలో 5,919 మంది పీటీడీ ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొననున్నారు.

14న ఎన్నిక.. 15న ఫలితాలు

పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి నామపత్రాలను అన్ని డిపోల మేనేజర్లు డిసెంబరు ఆరో తేదీ వరకు స్వీకరించనున్నారు. 7న పోటీకి అర్హుల జాబితా ప్రదర్శిస్తారు. నామపత్రాల ఉపసంహరణకు పదో తేదీ వరకు గడువు ఉంది. అదే రోజు సాయంత్రం తుది పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. 14న ఎన్నిక నిర్వహించి 15న ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఎన్నికైన ప్రతినిధులందరూ కలిసి ప్రధాన పాలకమండలి సభ్యుల ఎన్నికలో పాల్గొంటారు. ఈ నెల 29న విజయవాడలోని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో పాలకమండలి సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని