logo
Published : 01/12/2021 05:44 IST

డిసెంబరు, జనవరిల్లో అనుబంధ కళాశాలల క్రీడా పోటీలు

మాట్లాడుతున్న ఏఎన్‌యూ వీసీ ఆచార్య రాజశేఖర్‌

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల క్రీడా పోటీలను డిసెంబరులో నిర్వహిస్తారు. మంగళవారం ఏఎన్‌యూలో నిర్వహించిన క్రీడల బోర్డు సమావేశంలో క్రీడా క్యాలెండరును విడుదల చేశారు. డిసెంబరు, జనవరిలో వరసగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. అనుబంధ కళాశాలలకు సంబంధించి రెండు విడతలుగా జరుపుతారు. డిసెంబరు 30లోపు మొదటి విడత, జనవరి చివరి వారంలో రెండో విడత ఉంటాయి. డిసెంబరు, జనవరిలో అంతర్‌ విశ్వవిద్యాలయాల వెయిట్‌ లిఫ్టింగ్‌, సాఫ్ట్‌ బాల్‌ (పురుషులు), బ్యాడ్మింటన్‌ (మహిళలు) పోటీలకు ఏఎన్‌యూ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు వ్యాయామ కళాశాల సంచాలకులు డాక్టర్‌ జాన్సన్‌ ప్రకటించారు. డిసెంబరులో వెయిట్‌ లిఫ్టింగ్‌, జనవరిలో సాఫ్ట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. బ్యాడ్మింటన్‌ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌ఏసీ వీసీ ఆచార్య రాజశేఖర్‌ తదితరులు మాట్లాడారు. ఇందులో రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కరుణ, ఏఎన్‌యూ వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాల్‌కుమార్‌, యోగా విభాగం సమన్వయకర్త నారాయణ, తెనాలి జేఎంజే కళాశాల పీఈటీ సుజాత, ఆర్‌వీఆర్‌జేసీ కళాశాల పీఈటీ గౌరీ శంకర్‌, ఏఎస్‌ఎన్‌ కళాశాల పీఈటీ శేషగిరి పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని