logo
Published : 01/12/2021 05:44 IST

పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చేరువ

హోంమంత్రి సుచరిత

విద్యార్థినికి చెక్కు అందజేస్తున్న రాష్ట్ర హోంమంత్రి. పక్కన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసిక నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి సీఎం మంగళవారం జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ను హోంమంత్రి మేకతోటి సుచరిత కలెక్టరేట్‌ నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. సకాలంలో ఫీజు రీయింబర్స్‌ చేసి పూర్తి స్థాయిలో సమీక్షిస్తూ పిల్లల తల్లిదండ్రులు స్వయంగా కళాశాలలకు వెళ్లి ఫీజులు చెల్లించేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. జిల్లాలో 99,836 మంది విద్యార్థులకు గాను 88,919 మంది తల్లుల ఖాతాల్లో రూ.72.08 కోట్లను జమ చేశారన్నారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యార్థిని రేష్మ ముఖ్యమంత్రితో మాట్లాడారు. సమావేశం అనంతరం జగనన్న విద్యాదీవెన చెక్కును విద్యార్థుల తల్లిదండ్రులకు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జడ్పీఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్సీలు కల్పలత, లేళ్ల అప్పిరెడ్డి, జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జి.రాజకుమారి, నగర మేయర్‌ మనోహర్‌నాయుడు, ఉప మేయర్‌లు బాలవజ్రబాబు, సజీలా, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌రావు, కిలారి రోశయ్య, ముస్తఫా, మేరుగ నాగార్జున, డీఆర్‌వో పి.కొండయ్య, సాంఘీకసంక్షేమశాఖ డీడీ మధుసూదనరావు, మైనారిటీ సంక్షేమ శాఖాధికారి మస్తాన్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని