logo
Published : 01/12/2021 05:44 IST

మద్యం ఆదాయంతో సంక్షేమ పథకాలా..?


తెదేపా నాయకులతో కలిసి ధర్నా చేస్తున్న నసీర్‌

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: మద్యం ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధమని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌ విమర్శించారు. సంక్షేమ పథకాల అమలును బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు అప్పగించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించడాన్ని నిరసిస్తూ హిమని సెంటర్‌ గాంధీజీ విగ్రహం వద్ద తెలుగుదేశం భారీ నిరసన చేపట్టింది. వైకాపా ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. నసీర్‌ మాట్లాడుతూ ‘అధికారంలోకి రాగానే మద్య నిషేధం అమలు చేస్తామని ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. అమ్మఒడికి మద్యం ఆదాయాన్ని జత చేశారు. దేశంలో ఈ విధంగా ఎక్కడైనా ఉందా.. నవరత్నాలు అమలు చేయడం చేతగాకపోతే ప్రజల్ని క్షమించమని అడిగి దిగిపోవాలి’. అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు జాదా, పఠాన్‌ జమీర్‌, షేక్‌ రఫీ, రహీమ్‌, అఫ్జల్‌, రబ్బాని, ఉస్మాన్‌, రియాజ్‌, ఇమ్రాన్‌, రసూల్‌, జలీఖాన్‌, ఇలాహీ, సుభాని తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని