logo
Published : 01/12/2021 05:44 IST

చిత్ర వార్తలు

కంకులకు మొలకలు.. అన్నదాత కన్నీరు

రుస తుపానుల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నేల వాలిన వరి పైరు నీటిలో నానుతోంది. కోయకుండానే కంకులకు మొలకలు వస్తుండడంతో అన్నదాతలు బోరుమంటున్నారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు ఆయకట్టులో కనిపిస్తున్న ఇలాంటి దృశ్యాలు రైతుల ఆవేదనను తేటతెల్లం చేస్తున్నాయి. మళ్లీ వర్ష సూచనలు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

- న్యూస్‌టుడే, డోకిపర్రు(గుడ్లవల్లేరు)


యంత్రాలు తుప్పుపట్టి.. ఎరువుల తయారీ అటకెక్కి..

స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా మార్కెట్లలో పనికిరాని కూరగాయలు, పూల నుంచి ఎరువు తయారు చేయడానికి విజయవాడ రాజీవ్‌ పార్కు ఏర్పాటు చేసిన షెడ్డు ఇది. కూరగాయలు, పూల మార్కెట్లలోని వ్యర్థాలను యంత్రాల్లో వేసి.. కుళ్లబెట్టి.. ఎరువుగా తయారు చేయాలి. 2020లో దీన్ని ప్రారంభించి.. మూలన పడేశారు. వినియోగంలో లేకపోవడంతో.. యంత్రాలు తుప్పుపడుతున్నాయి. కూరగాయల వ్యర్థాలు కంపుకొడుతున్నాయి. ఇప్పటికైనా షెడ్డును, యంత్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

- ఈనాడు, అమరావతి


సారూ.. ఒంటికి పోయేదెలా ?

విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని పూల మార్కెట్‌ వద్దనున్న మూత్రశాలలు ఇవి. నిర్వహణ సక్రమంగా లేక అపరిశుభ్రంగా మారాయి. చెత్తంతా వాటిపక్కనే వేస్తున్నారు. ఆ చెత్తలోంచేవెళ్లి మూత్ర విసర్జన చేయాలి. అడ్డుగా ఉన్న రేకులుపోయి.. అధ్వానంగా తయారయ్యాయి. అధికారులు స్పందించి మూత్రశాలలు సక్రమంగా నిర్వహించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.

పక్కన పడేసిన మూత్రశాలలు

-ఈనాడు, అమరావతి


నష్టం చూడలేక.. దున్నేశారు!

ముసునూరు మండలంలోని గుళ్లపూడిలో 150 ఎకరాల్లో మిరప మొక్కలను రైతులు నాటారు. తుపాను కారణంగా పంట దెబ్బతింది. ఎన్ని రకాల మందులు వేసినా దిగుబడి లాభసాటిగా లేకపోవడంతో సుమారు 25 ఎకరాల్లోని పంటను దున్నేశామని వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, ముసునూరు


ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు ఆలయ ప్రాంగణంలో 2018లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయలు మహోత్సవాల్లో సిరివెన్నెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిమను అందజేస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ (ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి) మండలి బుద్దప్రసాద్‌. (దాచిన చిత్రం)

- అవనిగడ్డ గ్రామీణం, ఘంటసాల, న్యూస్‌టుడే


దశాబ్ద కాలమైంది... నిర్మాణం పూర్తయ్యేదెన్నడో!

తెనాలి మున్సిపాలిటీ పరిధిలో సుందరంగా తీర్చి దిద్దిన రోడ్డు..

తెనాలి మున్సిపాలిటీ నుంచి పెదరావూరు గ్రామ పంచాయతీ మధ్య 3 కి.మీ రహదారి. 2010లో రహదారి పనులు ప్రారంభించారు. తెనాలి పరిధిలోని రోడ్డు వరకు సుందరంగా తీర్చిదిద్దారు. డివైడర్లు, విద్యుత్‌ దీపాల వెలుగులు, పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం కనపడుతుంది. పెదరావూరు గ్రామ పరిధిలోకి వచ్చిన తర్వాత రహదారి డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. కొద్ది దూరం వెళ్లిన తర్వాత రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు అంచులు పాడైపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. చందోలు, చెరుకుపల్లి వెళ్లే రహదారి పూర్తిగా పాడైంది. ఇప్పటికైనా రహదారి పనులు పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

పెదరావూరు పరిదిలో అసంపూర్తిగా ఆగిన రోడ్డు పనులు

-ఈనాడు, అమరావతి

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని