logo
Published : 01/12/2021 05:12 IST

కలసి కొంటే.. కలదు లాభం

న్యూస్‌టుడే, భవానీపురం

గుణదలలో నివాసం ఉండే సరిత ఇంటి దగ్గర దుకాణంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ కొనుగోలు చేశారు. ప్యాకెట్‌పై ఎంఆర్‌పీ రూ.204 ఉంది. దుకాణదారు రూ.180కి విక్రయించారు. రూ.24 తగ్గిందని సరిత సంతోషపడి నాలుగు ప్యాకెట్లు కొనుగోలు చేశారు. అదే ప్యాకెట్‌ టోకు వ్యాపారుల వద్ద రూ.135కే లభిస్తుంది. కానీ ఆ ధరకు రావాలంటే 16 ప్యాకెట్లు ఉండే బాక్సును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబమే అన్ని ప్యాకెట్లు కొనుగోలు చేయాలంటే కొంచెం కష్టమే. అదే నాలుగైదు కుటుంబాల వారు కలిసి ఒక బాక్సును కొనుగోలు చేసి పంచుకుంటే రూ.135కే ఆయిల్‌ ప్యాకెట్‌ను పొందవచ్చు. ఒక నెల రోజుల పాటు ఆ కుటుంబానికి ఆయిల్‌తో పని ఉండదు.

క్క ఆయిల్‌ ప్యాకెట్‌, ఉల్లిపాయలనే కాదు వివిధ రకాల నిత్యావసర సరకులను ఆ విధంగానే ఎక్కువ మంది తెలియకుండానే అధిక ధరలకు కొనుగోలు చేస్తుంటారు. ఆ విధంగా చేయడం వల్ల నెలవారీ బడ్జెట్‌ పెరిగిపోతుంది. అదే నాలుగైదు కుటుంబాల వారు కావాల్సిన సరకులను టోకులో కొనుగోలు చేస్తే తక్కువ ధరలకు పొందే వీలుంది.

వ్యత్యాసం ఎక్కువే... ఉదాహరణకు రైతుబజారులో కొనే కూరగాయలకు, బహిరంగ మార్కెట్‌, సూపర్‌బజార్‌లలో కొనుగోలు చేసే వాటికి ధరల్లో తేడా ఉంటుంది. రైతుబజారులో రైతులే నేరుగా కూరగాయలు విక్రయించడం, అద్దెలు లేకపోవడం, తదితర కారణాలతో కూరగాయలు తక్కువకు దొరుకుతాయి. అదే బహిరంగ మార్కెట్‌లో నిర్వహణ ఖర్చులు, అద్దెలు, సిబ్బందికి జీతాలు, ఇలా...అనేక కారణాలతో ఎక్కువకు విక్రయించాల్సి వస్తుంది. అదే సూత్రం సరకుల విషయంలో కూడా అమలవుతుంది. సరకులను టోకు వ్యాపారుల నుంచి కొనడం ద్వారా కొంత మేర డబ్బులను ఆదా చేయవచ్చు. విజయవాడలోని వన్‌టౌన్‌, గొల్లపూడి, తదితర ప్రాంతాల్లో టోకు వ్యాపారులు అనేక మంది ఉన్నారు. వాస్తవానికి కొన్ని సూపర్‌బజార్లకు సరకులు కూడా టోకు వ్యాపారులే సరఫరా చేస్తుంటారు.

బస్తాల్లో విక్రయం...
రిటైల్‌గా కేజీ, అరకేజీ చొప్పున ఇస్తుంటారు. అదే టోకు వ్యాపారుల వద్ద బస్తాల్లోనే కొనుగోలు చేయాలి. నాలుగైదు కుటుంబాల వారు టోకు వ్యాపారుల వద్ద బస్తాల్లో కొనుగోలు చేసి ఇంటికి తీసుకుని వచ్చి పంచుకోవచ్చు. ఉల్లిపాయలు, పంచదార, కందిపప్పు, మినపప్పు, మంచినూనె, బియ్యం, వెల్లుల్లి, రవ్వలు, ఇలా...అనేక రకాల సరకులను కొనుగోలు చేయవచ్చు. టోకు వ్యాపారులు 25కేజీలు, 30 కేజీలు, 40, 50 కేజీల బస్తాలను విక్రయిస్తున్నారు. ఉల్లిపాయలను 40కేజీల బస్తాల్లో విక్రయిస్తారు. బృంద గృహాలు, అపార్టుమెంట్లలో ఉండేవారు అనుసరించొచ్చు.

ఇంటి బడ్జెట్‌ తల్లకిందులు...
ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొవిడ్‌ సమయంలో సామాన్యుల ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా మారింది. నిత్యావసర సరకులు, పిల్లల ఫీజులు, వాహనాల పెట్రోలు, గ్యాస్‌, ఇతర ఖర్చులతో ఇంటి బడ్జెట్‌ కూడా తల్లకిందులు అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నిత్యావసర సరకుల ధరలను కొంత మేర తగ్గించుకునే అవకాశం ఉంది.


ఒకేసారి కొనుగోలు చేస్తాం: మణి, పద్మ (వన్‌టౌన్‌)

మేము మూడు కుటుంబాల వాళ్లం ఒకే భవనంలో ఉంటాం. నిత్యావసర సరకులను ఒకేసారి కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకొచ్చి పంచుకుంటాం. కందిపప్పు, మినపప్పు, బియ్యం, పంచదార, నూనె, ఇతర సరకులను ఒకేసారి కొనుగోలు చేస్తాం. ఇంటికి తీసుకొచ్చి డబ్బాల్లో పోసుకుని ముగ్గురం పంచుకుంటాం. ఈ విధంగా బయట మార్కెట్‌ కంటే తక్కువ ధరకు సరకులను పొందేందుకు వీలుంటుంది.

ఆయిల్‌ ప్యాకెట్‌
టోకు  రూ.135      

రిటైల్‌  రూ.160     

 లాభం  25/

కందిపప్పు
టోకు  రూ.88      

రిటైల్‌  రూ.105      

లాభం 17/

చింతపండు

టోకు  రూ.160     

రిటైల్‌  రూ.200      

లాభం 40/

ఉల్లిపాయలు
టోకు  రూ.25      
రిటైల్‌  రూ.35      
లాభం 10/

మినపగుళ్ళు
టోకు  రూ.95      
రిటైల్‌  రూ.110      
లాభం 15/

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని