Crime News: అద్దెకు తీసుకుంటారు.. అమ్మేసుకుంటారు

కార్లు అద్దెకు తీసుకుని, ఇతరులకు విక్రయిస్తున్న ఇద్దరిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్సు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40లక్షల విలువైన మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...

Published : 15 Jan 2022 06:57 IST

మహ్మద్‌ సల్మాన్‌, హుస్సేన్‌. చిత్రంలో స్వాధీనం చేసుకున్న కార్లు

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: కార్లు అద్దెకు తీసుకుని, ఇతరులకు విక్రయిస్తున్న ఇద్దరిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్సు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40లక్షల విలువైన మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... కిషన్‌బాగ్‌కు చెందిన కారు డ్రైవర్‌ మహ్మద్‌ సల్మాన్‌ అలియాస్‌ డాన్‌(30), ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ (డిగ్రీ విద్యార్థి) స్నేహితులు. సల్మాన్‌ గతంలో ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహించే వాడు. లాక్‌డౌన్‌ సమయంలో నష్టాలు రాగా.. దాన్ని మూసివేశాడు. కార్లు అద్దెకు తీసుకుని విక్రయించాలని ఇద్దరూ పథకం వేశారు. అడిగినంత కిరాయి ఇస్తానని కారు యజమానులకు నమ్మబలికి అద్దెకు తీసుకుంటారు. వాటిని వేరే వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి మోసాలపై టాస్క్‌ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వారు ఆసిఫ్‌నగర్‌ పోలీసులతో కలిసి సల్మాన్‌, మహ్మద్‌ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. మూడు కార్లు, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. సల్మాన్‌పై సైదాబాద్‌ ఠాణాలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఆసిఫ్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, ఉప్పల్‌ ఠాణాల పరిధిలో ఈ మూడు కార్లు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం నిందితులను ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని