Nokia 6310: మరోసారి మార్కెట్లోకి నోకియా క్లాసిక్‌ ఫోన్‌..కారణమిదే!  
close

Published : 18/10/2021 18:42 IST

Nokia 6310: మరోసారి మార్కెట్లోకి నోకియా క్లాసిక్‌ ఫోన్‌..కారణమిదే!  

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా మోడల్స్‌లో క్లాసికల్ ఫీచర్‌ ఫోన్‌ని మరోసారి భారత్‌లో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. గతంలో వచ్చిన నోకియా 6310 ఫోన్‌ను ఇప్పటికే 2001 సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఏడాదితో ఈ ఫోన్‌ మార్కెట్లో విడుదలయి 20 ఏళ్లు కావడంతో సరికొత్త ఫీచర్స్‌తో మరోసారి ఈ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. నోకియా ఫోన్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది మన్నిక, బ్యాటరీ. మరి ఈ ఫీచర్‌ ఫోన్‌లో పీచర్స్‌ ఎలా ఉన్నాయో చూద్దాం. 

ఈ ఫోన్‌లో 2.86-అంగుళాల క్యూవీజీఏ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. యూనిసాక్ 6531ఎఫ్ ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఎస్‌30+ ఓఎస్‌ సాయంతో పనిచేస్తుంది. వెనుకవైపు 0.3ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 1,150 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజులు స్టాండ్‌బైలో ఉంటుంది. అలానే 20 గంటలపాటు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్‌ మాట్లాడుకోవచ్చని హెచ్‌ఎండీ గ్లోబల్ తెలిపింది. ఇంకా ఈ ఫోన్‌లో నోకియా ఫోన్లలో ఎంతో పాపులర్‌ అయిన స్నేక్ గేమ్‌ ఇస్తున్నారు. డ్యూయల్‌ సిమ్‌ సపోర్ట్‌, ఎంపీ3 ప్లేయర్‌, బ్లూటూత్‌, ఎల్‌ఈడీ టార్చ్, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లున్నాయి. 16 ఎంబీ ర్యామ్‌/8 ఎంబీ అంతర్గత స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. ప్రస్తుతం నోకియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ధర రూ. 3,399గా ఉంది. బ్లాక్‌, గ్రీన్‌, బ్లూ, ఎల్లో రంగుల్లో లభిస్తుంది.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న