IND Vs SL: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

తాజా వార్తలు

Updated : 28/07/2021 20:01 IST

IND Vs SL: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

కొలంబో: మరికొద్దిసేపట్లో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్‌ డాసున్‌ శనక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఇక, మంగళవారం జరగాల్సిన ఈ టీ20‌.. భారత ఆటగాడు కృనాల్‌ పాండ్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇవాళ్టికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, నితీశ్‌ రాణా, చేతన్‌ సకారియా టీ20ల్లో అరంగేట్రం చేశారు.

భారత జట్టు
శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్ ‌(కీపర్‌), నితీశ్‌ రాణా, భువనేశ్వర్‌ కుమార్, కుల్‌దీప్‌ యాదవ్‌,  రాహుల్‌ చాహర్‌, నవదీప్‌ సైని, చేతన్‌ సకారియా, వరుణ్‌ చక్రవర్తి.

శ్రీలంక జట్టు
అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (కీపర్‌), ధనంజయ డిసిల్వ, సమర విక్రమ, డాసున్‌ శనక (కెప్టెన్‌), రమేష్ మెండిస్‌, వానిండు హసరంగ, చామిక కరుణరత్నె, ఇసురు ఉదాన, అఖిల ధనంజయ, దుష్మంత చమీరా.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని