దోషిగా తేలిన శ్రీలంక మాజీ ఆటగాడు

తాజా వార్తలు

Published : 29/01/2021 09:44 IST

దోషిగా తేలిన శ్రీలంక మాజీ ఆటగాడు

దుబాయ్‌: శ్రీలంక మాజీ పేసర్‌ దిల్హార లోకుహెట్టిగే మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు స్వతంత్ర అవినీతి నిరోధక ట్రైబ్యునల్‌ తేల్చింది. 2017లో యూఏఈలో ఓ టీ20 టోర్నీ సందర్భంగా ఆ జట్టు తరపున ఆడిన అతను.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ 2019లో ఐసీసీ సస్పెండ్‌ చేసింది. అయితే ఆ శిక్షను సవాలు చేసిన అతను స్వతంత్ర ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. విచారణ అనంతరం అతను తప్పు చేసినట్లు ఆ ట్రైబ్యునల్‌ వెల్లడించింది. మరోవైపు ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే టీ10 లీగ్‌లో ఆడే ప్రయత్నం చేసినందుకు ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు తరపున ఐసీసీ శిక్ష విధించింది. ఇప్పుడా శిక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి. లంక తరపున అతను 9 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు.  

ఇవీ చదవండి..
అరంగేట్రం ముందు రాత్రి నిద్రమాత్ర వేసుకున్న గిల్‌!
తొలిసారిగా భారత్‌తో భారత్‌-ఏ టెస్టు మ్యాచు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని