శ్రీలంక క్రికెటర్‌కి హార్దిక్‌పాండ్య స్పెషల్‌ గిప్ట్‌

తాజా వార్తలు

Published : 28/07/2021 01:44 IST

శ్రీలంక క్రికెటర్‌కి హార్దిక్‌పాండ్య స్పెషల్‌ గిప్ట్‌

(photo:Hardik Pandya Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతీ క్రికెటర్‌కి ఒక రోల్‌మోడల్‌ ప్లేయర్‌ ఉంటాడు. కానీ ఆ రోల్‌మోడల్‌గా తీసుకున్న ఆటగాడితో కలిసి మ్యాచ్‌ ఆడటం, వారి నుంచి బహుమతి అందుకోవడం చాలా అరుదు. ఆదివారం భారత్‌, శ్రీలంక మధ్య జరిగిన తొలిటీ20లో ఇలాంటి ఆసక్తికరమైన ఘటన జరిగింది. వన్డేల్లో మంచి ప్రదర్శన కనబరిచి, ఆదివారం జరిగిన తొలి టీ20లో శ్రీలంక ఆల్‌రౌండర్‌ చమీకా కరుణరత్నె పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. 

అయితే, చమీకా కరుణరత్నెకు టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య అంటే అమితమైన అభిమానం. అంతేకాదు చమీకాకు హార్దిక్‌ రోల్‌మోడల్‌ కూడా. కాగా, ఈ టీ20లో అరంగేట్రం చేసిన కరుణరత్నెకు అతని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఓ ప్రత్యేకమైన బహుమతిని హార్దిక్‌ అందించాడు. చమీకా కరుణరత్నెకు హార్దిక్‌ తన బ్యాట్‌ను బహుమతిగా అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని చమీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ‘‘నా టీ20 అరంగేట్రంలో నా రోల్‌మోడల్‌ హార్దిక్‌ పాండ్య చేతుల మీదుగా బ్యాట్‌ అందుకున్నందుకు గర్వపడుతున్నాను. హార్దిక్‌ అద్భుతమైన వ్యక్తి. నేను ఈ రోజును ఎప్పటికీ మార్చిపోలేను’’ అని రాసుకొచ్చాడు. 

హార్దిక్‌పాండ్య చూపిన క్రీడాస్ఫూర్తిని చూసి జట్టు సహచరులతోపాటు అతని అభిమానులు పాండ్యను అభినందిస్తున్నారు. ఇక, మంగళవారం ఇరుజట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 బుధవారానికి వాయిదాపడింది. హార్దిక్‌ సోదరుడు, భారత క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్‌ను వాయిదా వేశారు.


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని