టెస్టుల్లో ఆడటమే నా  అంతిమ లక్ష్యం: సకారియా

తాజా వార్తలు

Published : 11/06/2021 22:25 IST

టెస్టుల్లో ఆడటమే నా  అంతిమ లక్ష్యం: సకారియా

(photo:Chetan Sakaria Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: జులైలో టీమ్‌ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఇందు కోసం బీసీసీఐ గురువారం 20 మంది ఆటగాళ్లతోపాటు ఐదుగురు నెట్‌ బౌలర్లను ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడి రాణించిన యువ క్రికెటర్‌ చేతన్‌ సకారియా ఈ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే, టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడటం తన అంతిమ లక్ష్యమని సకారియా పేర్కొన్నాడు.

‘నా అంతిమ లక్ష్యం భారత్‌ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం. సుదీర్ఘ కాలం టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నా. టెస్టు క్రికెట్ జీవితంలాంటిది. ఇది నిజమైన సవాళ్లను విసురుతుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నా ఆలోచన ధోరణిని మార్చివేసింది. ఆ జట్టులోని ఉన్న  ప్రపంచస్థాయి అత్యుత్తమ ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం నాలో నమ్మకాన్నిచ్చింది. నా ప్రణాళికలను ఎలా అమలు చేయాలో నేర్చుకున్నాను’ అని సకారియా అన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని