అఫ్రిది చితక్కొట్టాడు..

తాజా వార్తలు

Published : 28/11/2020 23:00 IST

అఫ్రిది చితక్కొట్టాడు..

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌)లో పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ షాహిద్‌ అఫ్రిది చితక్కొట్టాడు. 20 బంతుల్లో అర్ధశతకం బాది తనలో ఇంకా క్రికెట్‌ ఆడే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. గురువారం ప్రారంభమైన ఈ టీ20 లీగ్‌లో పాక్‌ మాజీ సారథి గాలే గ్లాడియేటర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జఫ్నా స్టాలియన్స్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లో అఫ్రిది (58; 23 బంతుల్లో 3x4, 6x6) రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశాడు. 20 బంతుల్లోనే అర్ధశతకం బాది ఆ జట్టుకు మంచి 175/8 స్కోర్‌ అందించాడు. కాగా, ఛేదనలో అవిష్క ఫెర్నాండో (92*; 63 బంతుల్లో 5x4, 7x6) చెలరేగడంతో జఫ్నా టీమ్‌ 2 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఇక పాకిస్థాన్‌ తరఫున దాదాపు రెండు దశాబ్దాలు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అఫ్రిది 2017లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌తో పాటు ఇతర లీగులు కూడా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అర్ధశతకం బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని