జగన్‌ పాలనే తెదేపాను గెలిపిస్తుంది: జేసీ

తాజా వార్తలు

Updated : 07/03/2021 14:23 IST

జగన్‌ పాలనే తెదేపాను గెలిపిస్తుంది: జేసీ

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలికలో గెలుపు కోసం తెలుగుదేశం, వైకాపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అక్కడ ఇరు పార్టీల ప్రచారం జోరందుకుంది. తెదేపా అభ్యర్థులను గెలిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం తాడిపత్రిలో ప్రచారం నిర్వహించారు. ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి మరీ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ ఆయన ప్రజలను కోరారు. సీఎం జగన్‌ అరాచక పాలనే తెదేపాకు పీఠాన్ని కట్టబెడుతుందని ప్రభాకర్‌‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన కుమారుడిని పురపాలిక ఛైర్మన్‌ పీఠంపై కూర్చోబెట్టేందుకు శక్తిమేరకు కృషి చేస్తున్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే రెండు స్థానాలు ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతం 34 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గెలుపుపై ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని