Modi: డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వంతో డబుల్ ప్రయోజనాలు

తాజా వార్తలు

Published : 14/09/2021 22:45 IST

Modi: డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వంతో డబుల్ ప్రయోజనాలు

యోగిపై మోదీ ప్రశంసలు.. విపక్షాలపై విమర్శలు

అలీగఢ్‌: డబుల్ ఇంజిన్ ప్రభుత్వపు డబుల్ ప్రయోజనాలకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉదాహరణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటించిన మోదీ.. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. మంగళవారం అలీగఢ్‌లో రాజా మహేంద్రప్రతాప్‌ సింగ్ స్టేట్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘ఒకప్పుడు దేశాభివృద్ధికి అడ్డంకిగా భావించిన ఉత్తర్‌ప్రదేశ్‌ ఇప్పుడు దేశంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తుండటం సంతృప్తినిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఈ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోంది. అనుకూల వాతావరణం, అవసరమైన వనరులు అందించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వపు డబుల్ ప్రయోజనాలకు ఈ రాష్ట్రం నిదర్శనంగా నిలిచింది’ అంటూ మోదీ అన్నారు. పనిలోపనిగా డబుల్ ఇంజిన్ అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేసిన ప్రతిపక్షాలకు ఆయన బదులిచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, మాయావతి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని