Modi: కొవిడ్ సమయంలో కూడా ఉపాధి కల్పించాం: మోదీ

తాజా వార్తలు

Published : 16/09/2021 21:43 IST

Modi: కొవిడ్ సమయంలో కూడా ఉపాధి కల్పించాం: మోదీ

రక్షణ శాఖకు చెందిన భవనాల్ని ప్రారంభించిన ప్రధాని

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దిల్లీలో రక్షణ కార్యాలయ సముదాయాల్ని ప్రారంభించారు. దేశ రాజధానిలోని కస్తుర్బా గాంధీ, ఆఫ్రికా అవెన్యూలో ఈ భవనాల్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ప్రధాని మాట్లాడారు. 

‘‘న్యూ ఇండియా’ విజన్‌కు అనుగుణంగా దిల్లీ ముందుకు వెళ్తోంది. ఈ కొత్త రక్షణ కార్యాలయ సముదాయం ఏర్పాటుతో సైన్యానికి అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 24 నెలల్లో పూర్తి కావాల్సిన ఈ సముదాయం రికార్డు స్థాయిలో 12 నెలల్లోనే పూర్తయింది. కొవిడ్ సమయంలో ఇది ఎంతోమంది కార్మికులకు ఉపాధినిచ్చింది’ అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. 

అలాగే ప్రధాని ‘సెంట్రల్ విస్టా’కు చెందిన వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ‘సులభమైన జీవన విధానం, వ్యాపారంపై దృష్టి సారించిన వేళ.. అధునాతన మౌలిక సదుపాయాలు కూడా అందులో కీలక పాత్ర పోషిస్తాయి. సెంట్రల్ విస్టా అభివృద్ధి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ముందుగా చెప్పిన గడువులోపలే ఈ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తవుతుంది’ అని ప్రధాని స్పష్టం చేశారు. అలాగే కొవిడ్ సమయంలో ఈ నిర్మాణాలెందుకని ప్రశ్నించిన విపక్షాల వైఖరిని ప్రధాని తప్పుపట్టారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని