Supreme Court: కరోనా మాత ఆలయం కూల్చివేత.. పిల్‌ వేసిన వ్యక్తికి రూ.5వేల జరిమానా

తాజా వార్తలు

Updated : 10/10/2021 06:42 IST

Supreme Court: కరోనా మాత ఆలయం కూల్చివేత.. పిల్‌ వేసిన వ్యక్తికి రూ.5వేల జరిమానా

 పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు

దిల్లీ: కరోనా మాత ఆలయం కూల్చివేతను సవాల్‌ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తులకు సుప్రీంకోర్టు రూ.5వేల జరిమానా విధించింది. ఆ పిటిషన్‌నూ తోసిపుచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గడ్‌ జిల్లా జుహి శుకుల్‌పుర్‌ గ్రామంలోని ఓ స్థలంలో లోకేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ జూన్‌7న కరోనా మాత ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జూన్‌ 11వ తేదీ రాత్రి ఆ గుడి కూల్చివేతకు గురైంది. లోకేశ్‌ కుమార్‌, అతని భార్య దీపమాల శ్రీవాస్తవ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ సమయంలో ఆలయం నిర్మించిన స్థలం వివాదంలో ఉందని,  అది ముగ్గురికి చెందిన ఉమ్మడి ఆస్తి అని తెలిసింది. దీంతో జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ల ధర్మాసనం పిల్‌ దాఖలు చేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద స్థలంలో గుడిని నిర్మించడమే కాకుండా కోర్టు సమయాన్ని దుర్వినియోగపరిచినందుకు రూ.5వేల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు న్యాయవాదుల సంక్షేమ సంఘ నిధికి జమచేయాలని ఆదేశించింది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని