Corona: 29 లక్షల జనాభా ఉన్న ఆ నగరం బంద్‌

తాజా వార్తలు

Published : 13/09/2021 07:10 IST

Corona: 29 లక్షల జనాభా ఉన్న ఆ నగరం బంద్‌

కొవిడ్‌ కట్టడికి చైనా చర్యలు

బీజింగ్‌: ఎక్కడైనా ఒక్క కొవిడ్‌ కేసు బయటపడితే.. చైనా వెంటనే అప్రమత్తం అవుతోంది. ఈ క్రమంలో 29 లక్షల జనాభా ఉన్న ఓ నగరంలో ఆదివారం ‘బంద్‌’ విధించింది. ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని పుతియాన్‌ నగరంలో కొత్తగా 19 కరోనా కేసులు బయపడగా.. బస్సులు, రైళ్లు, సినిమాలు, బార్లు, జిమ్‌లు, పర్యాటక ప్రాంతాలు వంటివాటన్నింటినీ మూసివేశారు. స్థానికులెవరూ బయటకు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా వెళ్లాల్సి వస్తే 48 గంటల్లో చేయించుకున్న కరోనా నిర్ధారణ పరీక్ష ‘నెగెటివ్‌’ రిపోర్టును చూపించడం తప్పనిసరి చేశారు. వైరస్‌ను కట్టడి చేసినట్లు 2020లోనే చైనా ప్రకటించినప్పటికీ అత్యధిక సాంక్రమిక శక్తి ఉన్న డెల్టా రకంతో పలుచోట్ల కేసులు బయట పడుతూనే ఉన్నాయి. ఎక్కువగా రష్యా, మయన్మార్‌ తదితర దేశాల నుంచి వస్తున్నవారిలోనే కరోనా బయటపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పుతియాన్‌లో ఆగస్టు 4న సింగపూర్‌ నుంచి వచ్చిన ఓ విద్యార్థి తండ్రికి వైరస్‌ సోకి.. అనంతరం వ్యాప్తి చెందినట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, జపాన్‌లో 50% మందికి కరోనా టీకా రెండు డోసులను అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని