Corona: కరోనా వేళ అప్పు తీసుకున్న వాళ్లు ఎంతమందో తెలుసా?

తాజా వార్తలు

Updated : 22/08/2021 09:25 IST

Corona: కరోనా వేళ అప్పు తీసుకున్న వాళ్లు ఎంతమందో తెలుసా?

ఆర్థికశాఖ గణాంకాలు వెల్లడి

ఈనాడు, దిల్లీ: కరోనా చికిత్స కోసం దేశవ్యాప్తంగా 1.33 లక్షల మంది బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నట్లు ఆర్థికశాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్రలు ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు బిల్లులు వేయడంతో వాటిని చెల్లించడానికి చాలామంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల్లో చేరిన ఖాతాదారుల కుటుంబసభ్యుల కోసం బ్యాంకులు అన్‌సెక్యూర్డ్‌ రుణాలు ఇచ్చాయి. కరోనా కారణంగా అప్పటికే ఉపాధి, ఉద్యోగావకాశాలు దెబ్బతిన్న ఎంతోమంది బ్యాంకులు అందించిన ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ఆసుపత్రుల ఫీజులు చెల్లించారు. కేవలం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారే 1.33 లక్షలమంది ఉన్నారు. ఆసుపత్రుల ఫీజులు చెల్లించడానికి ఇతర ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు మార్గాలలో రుణాలు తీసుకున్నవారు అదనం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని