Child adoption: మరింత సులభంగా పిల్లల దత్తత

తాజా వార్తలు

Published : 15/09/2021 20:48 IST

Child adoption: మరింత సులభంగా పిల్లల దత్తత

కొత్త నిబంధనలు తీసుకురానున్న కేంద్రం

దిల్లీ: చిన్న పిల్లల అంతర్‌ దేశ దత్తతలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలతో కేంద్రీయ దత్తత వనరుల ప్రాధికారసంస్థ (సీఏఆర్‌ఏ) హిందూ దత్తతలు, పోషణ చట్టం (హెచ్‌ఏఎంఏ) కింద నూతన నిబంధనలను రూపొందించినట్లు మంగళవారం ఓ అధికారి చెప్పారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులకు సంబంధించి హెచ్‌ఏఎంఏ కింద అంతర్‌దేశ దత్తతలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు లేవు. అందువల్ల హెచ్‌ఏఎంఏ కింద చిన్నారులను దత్తత తీసుకునేందుకు వచ్చిన ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), విదేశాల్లోని భారతీయ పౌరులు (ఓసీఐలు) నిరభ్యంతర పత్రం పొందేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని, జిల్లా కలెక్టర్‌ పరిశీలన అనంతరం సీఏఆర్‌ఏ నేరుగా నిరభ్యంతర పత్రం జారీచేస్తుందని ఆ అధికారి వివరించారు. ఇప్పటివరకు నిరభ్యంతర పత్రాన్ని న్యాయస్థానం జారీ చేసేదని, అందువల్ల ఎక్కువ సమయం పట్టేదని చెప్పారు. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ నిబంధనలను ఖరారు చేసిందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన జారీచేయనుందని ఆయన వివరించారు.

సొంత రాష్ట్రం వారికే తొలి ప్రాధాన్యం: పిల్లలను దత్తత తీసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తే అలాంటివారిలో శిశువు సొంత రాష్ట్రం వారికే తొలి ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని, దానివల్ల చిన్నారి సాంఘిక, సాంస్కృతిక అంశాలు పరిరక్షించబడతాయని ఆ అధికారి చెప్పారు. ప్రస్తుతం దత్తత తీసుకునేవారు మూడు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవచ్చు. అయితే బాల న్యాయ చట్టం (జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌) మాత్రం.. దత్తతకు వెళ్లే చిన్నారి ఏ ప్రాంతానికి చెందితే.. ఆ ప్రాంతం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిని పరిరక్షించాలని స్పష్టం చేస్తోందని ఆయన వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని