సిఫార్సులున్నా.. ఆ బడిలో సీటు కష్టం!

తాజా వార్తలు

Published : 21/11/2020 00:08 IST

సిఫార్సులున్నా.. ఆ బడిలో సీటు కష్టం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ పాఠశాలలో సీటు కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పోటీ పడతారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో కూడా ప్రయత్నిస్తారు. అయినా ఏటా చాలా మందికి నో అడ్మిషన్‌ బోర్డే అక్కడ దర్శనమిస్తుంది. అయితే ఇదేదో కార్పొరేట్‌, అంతర్జాతీయ పాఠశాల కాదు. ఓ సాదాసీదా సర్కారు బడి.

ఉపాధ్యాయుల అంకితభావం తోడైతే ప్రభుత్వ పాఠశాలతో ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చనేదానికి అనంతపురంలోని ఓ పాఠశాల నిదర్శనంగా నిలుస్తోంది. ధర్మవరం పురపాలక సంఘం పరిధిలోని బీఎస్‌ఆర్‌ ఉన్నత పాఠశాలలో సీటు కోసం విద్యార్థులు భారీగా పోటీపడే పరిస్థితి నెలకొంది. ఏటా నవంబర్‌లోనే రాబోయే విద్యా సంవత్సరానికి సీట్లు భర్తీ అయిపోవడం, నోఅడ్మిషన్‌ బోర్డు పెట్టడం అక్కడ పరిపాటిగా మారింది. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు సైతం సంపాదించి ఆ పాఠశాలలో అడ్మిషన్‌ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. క్రమశిక్షణ, ఉత్తమ విద్యాబోధన కారణంగానే బీఎస్‌ఆర్‌ పాఠశాలకు ఇంత ఆదరణ వచ్చింది. పనివేళలు ముగిసినా ఉపాధ్యాయులు బడిలోనే ఉంటూ విద్యార్థులకు సాన పెట్టడంలో నిమగ్నమవుతారు. అవసరమైనప్పుడు ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఇందుకోసం సెలవు రోజైన ఆదివారం నాడూ కృషి చేస్తారు. ఇన్ని మంచి పద్ధతులు పాటిస్తున్నందునే విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందిస్తూ పలువురు దాతలు ప్రోత్సహిస్తున్నారు.

ఇక్కడ జూన్‌లో పాఠశాల ప్రారంభమవగా జులై నుంచే ప్రత్యేక తరగతులు తీసుకుంటారు. బీఎస్‌ఆర్‌ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 800 సీట్లుండగా ప్రస్తుతం 1040మంది విద్యార్థులకు బోధన సాగుతోంది. విద్యాశాఖ ప్రత్యేక అనుమతితో అదనంగా విద్యార్థులకు చదువు చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగినా ఉపాధ్యాయుల కొరత మాత్రం ఈ చదువుల బడికి సమస్యగా మారింది. మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించి చేయూత అందించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని