Brahmotsavam: కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి

తాజా వార్తలు

Updated : 10/10/2021 15:23 IST

Brahmotsavam: కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి


తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు స్వామివారు అమ్మవార్లతో కలసి దర్శనమిచ్చారు. కల్యాణ మండపంలో నిర్వహించిన కల్పవృక్ష వాహన సేవలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు చంద్రకోలు, దండం ధరించి కనిపించారు. వాహన సేవలో భాగంగా అర్చకులు నక్షత్ర, పూర్ణకుంభ హారతులిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. రంగనాయకుల మండపంలో ఆస్థానాన్ని శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఈ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామివారు సర్వభూపాల వాహనంపై అభ‌య‌మిస్తారు.

స్వామివారి సేవలో ప్రముఖులు..

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్‌ న‌ర‌సింహ‌, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, సినీ నటుడు విజయ్‌ దేవరకొండ కుటుంబం శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్పవృక్ష వాహన సేవలో జస్టిస్ పీఎస్‌ న‌ర‌సింహ పాల్గొన్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని