Tirumala Brahmostavam: గజ వాహనంపై దేవదేవుడు

తాజా వార్తలు

Updated : 12/10/2021 22:05 IST

Tirumala Brahmostavam: గజ వాహనంపై దేవదేవుడు

తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఆరోరోజు రాత్రి గజ వాహనంపై శ్రీ మలయప్పస్వామి వారు కొలువుదీరి భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు.

స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు మంగళవారం సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు స్వర్ణరథం బదులుగా శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి వారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే రాజులకురాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్ఠించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని