ఆర్టీసీ బస్సులో ‘అనంత’ కలెక్టర్‌ 

తాజా వార్తలు

Updated : 22/01/2021 15:56 IST

ఆర్టీసీ బస్సులో ‘అనంత’ కలెక్టర్‌ 

అనంతపురం: అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పాఠశాల విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గొంచిరెడ్డిపల్లి గ్రామం నుంచి మండల కేంద్రంమైన బ్రహ్మసముద్రం వరకు ఆయన బస్సులో వెళ్లారు. గ్రామం నుంచి మండల కేంద్రంలో ఉన్న పాఠశాల వరకు వెళ్లేందుకు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ తల్లిదండ్రులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన  కలెక్టర్‌ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సర్వీసు ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా గొంచిరెడ్డిపల్లిలో బస్సును ప్రారంభించిన ఆయన‌.. అందులోనే ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు.

ఇదీ చదవండి..

అంతుచిక్కని కారణాలతో పలువురికి అస్వస్థతAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని