నడిచి వచ్చే అపర సంజీవిని
logo
Published : 11/06/2021 03:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నడిచి వచ్చే అపర సంజీవిని

సుపత్రికి చేరకుండానే గాలిలో కలిసిపోతున్న ప్రాణాలను రక్షించేందుకు లార్డ్స్‌ చర్చి ఆధ్వర్యంలో మొబైల్‌ ఐసీయూ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వెరా స్మార్ట్‌ హెల్త్‌ కేర్‌ సహకారంతో అత్యాధునిక వసతులను సమకూర్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున బస్సును కేటాయించారు. ఈ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం ప్రారంభించారు. మెడికల్‌ యూనిట్ బస్సులో కొవిడ్‌ పరీక్షల కోసం ల్యాబ్‌, ఒక వైద్యుడు, ఇద్దరు నర్సులతోపాటు ఆక్సిజన్‌తో కూడిన 10 పడకలు, ఏసీ సౌకర్యం ఉంటాయి. తద్వారా రోగిని పరీక్షించడంతోపాటు ఆక్సిజన్‌ను సకాలంలో అందించి ప్రాణాపాయం నుంచి కాపాడగలుగుతారు.

- ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని