విత్తన దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు
logo
Published : 11/06/2021 03:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విత్తన దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ఖమ్మంలో విత్తన దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

ఖమ్మం వ్యవసాయం, ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో గురువారం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం నగరంలో రెండు, పాలేరులో నాలుగు, కూసుమంచిలో ఐదు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. బీజీ-3 పత్తి విత్తనాల విక్రయాలు, అనుమతి లేకుండా విత్తన అమ్మకాలపై ఆరాదీశారు. దుకాణాల్లో పరిశీలించారు. టాస్క్‌ఫోర్‌్్స డీఎస్పీ నందిరామ్‌, సీడ్‌ సర్టిఫికేషన్‌ ఆఫీసర్‌ విజయ్‌కుమార్‌, ఏడీఏ అనిత, ఇన్‌ఛార్జి డీఏవో శ్రీనివాసరెడ్డి, ఏడీఏలు శ్రీనివాసరెడ్డి, విజయచందర్‌, ఖమ్మం అర్బన్‌, రూరల్‌ ఏవోలు పాల్గొన్నారు.
మిరప, పత్తి విత్తనాలు సీజ్‌: జిల్లాకు చెందిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గురువారం ఖమ్మం నగరంలో పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బర్మాషెల్‌రోడ్డులోని భాస్కర్‌ సీడ్‌ ఏజెన్సీని తనిఖీ చేయగా లైసెన్స్‌ గడువు ముగిసినప్పటికీ రెన్యూవల్‌ చేయకుండా వ్యాపారం చేస్తుండటంతో అతనిపై మూడో పట్టణంలో కేసు నమోదు చేశారు. లైసెన్స్‌ లేకుండా విక్రయిస్తున్న సుమారు రూ.26.38లక్షల పత్తి, మిరప విత్తనాలను సీజ్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రామాంజనేయులు, ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు, ఇన్‌ఛార్జి డీఏవో శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఏడీఏ శ్రీనివాసరావు, సీఐ శ్రీధర్‌, టాస్క్‌ఫోర్‌్్స సీఐ రవికుమార్‌, ఖమ్మం అర్బన్‌ ఏవో కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని