నాలుగు కేంద్రాలు.. 3,467 మందికి టీకాలు
logo
Published : 11/06/2021 03:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగు కేంద్రాలు.. 3,467 మందికి టీకాలు

● నేటి నుంచి అన్నపూర్ణకాలనీలో మరో కేంద్రం


కేంద్రాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, జిల్లా టీకా అధికారిణి కృపాబాయి

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే : చిరు వ్యాపారులకు టీకాలు ఇచ్చేందుకు రామగుండం నగరపాలిక, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీకా శిబిరంలో గురువారం 3,467 మందికి కరోనా నివారణ టీకాలు ఇచ్చారు. బుధవారం వరకు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో మాత్రమే రెండు ప్రత్యేక టీకా శిబిరాలు నిర్వహించగా రద్దీ ఎక్కువగా ఉండటంతో గురువారం అదనంగా గోదావరిఖనిలోని సేక్రడ్‌ హార్ట్‌ ఉన్నత పాఠశాల, ఎన్టీపీసీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనంగా రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మరో ప్రత్యేక టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రత్యేక టీకా కేంద్రాల్లో కొంతమేరకు రద్దీ తగ్గనుంది. శుక్రవారం టీకా తీసుకునేందుకు ముందస్తుగా 1416 మంది తమ పేర్లను కొవిన్‌ యాప్‌లో నమోదు చేసుకున్నారు. వీరితో పాటు అప్పటికప్పుడు చాలామంది చిరువ్యాపారులతో పాటు మరికొందరు అర్హులైన వారు ఆయా ప్రత్యేక టీకా శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకొని టీకాలు తీసుకోనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని