సివిల్స్‌లో తెలుగు విద్యార్థుల రాణింపు
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

సివిల్స్‌లో తెలుగు విద్యార్థుల రాణింపు


ర్యాంకులు సాధించిన వారితో కమిషనర్‌ పవన్‌ కుమార్‌, డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తదితరులు

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : కొన్నేళ్లుగా సివిల్స్‌ ఫలితాలను పరిశీలిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సివిల్స్‌లో ఎక్కువ మంది అర్హత సాధిస్తున్నారని ఆంధ్రా, తెలంగాణ రీజియన్‌ ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ సీˆవీ పవన్‌కుమార్‌ అన్నారు. ఆదివారం శరత్‌ చంద్ర ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో సిద్ధార్థ ఆడిటోరియంలో ‘సివిల్స్‌పై అవగాహన సదస్సు’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్‌ మాట్లాడుతూ సివిల్స్‌ అంటే భయపడొద్దు, ఇష్టం, లక్ష్యంతో చదివితే కచ్చితంగా ర్యాంకు సాధించవచ్చన్నారు. ఏపీˆహెచ్‌ఎస్‌ఎస్‌పీˆ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో సివిల్స్‌ చదవాలనే వారి ఆసక్తి పెరుగుతోందన్నారు. శరత్‌ చంద్ర ఐఏఎస్‌ అకాడమీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్ర తోట, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డివిజన్‌లో ఇంజనీర్‌ బి.విజయకీర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో తిరుపతిరావు 441, పి.గౌతమి 317 ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని