రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు పలువురి ఎంపిక
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు పలువురి ఎంపిక

ఎంపికైన క్రీడాకారులు వీరే..

ఈపూరు, న్యూస్‌టుడే : జిల్లా స్థాయి సీనియర్‌ పురుషులు మహిళల రెజ్లింగ్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం ఈపూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగాయి. జిల్లా రెజ్లింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.వెంకయ్య పోటీలను ప్రారంభించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడేందుకు వివిధ విభాగాల నుంచి మొత్తం 19 మంది క్రీడాకారులు ఎంపిక చేశారు. పురుషుల ఫ్రీస్టైల్‌ విభాగంలో కె.శివనాగరాజు(పిల్లుట్ల), డి.వంశీ(చిగురుపాడు), టి.మరియబాబు(దొడ్లేరు), వై.వంశీ(రాజుపాలెం), కె.రామకృష్ణ(గుళ్లాపల్లి)  ఎంపికయ్యారు. పురుషుల గ్రీక్‌ రోమన్‌ స్టైల్‌ విభాగంలో ఎస్‌.సుధాకర్‌(తెనాలి), ఎన్‌.విజయ్‌కుమార్‌ (వేల్లూరు), వై.రత్నకుమార్‌ (పిడుగురాళ్ల), పెదరాయుడు(నరసరావుపేట), సీహెచ్‌.రాజు(దూలిపాళ్ల), పి.నాగరాజు(గుళ్లపల్లి), పి.పవన్‌(గుంటూరు), ఎన్‌.శివనాగేంద్రప్రసాద్‌ ఎంపికయ్యారు. మహిళల విభాగంలో పి.సాగరిక, ఎస్‌కె నూర్జహాన్‌, పి.మేరీ, కె.సోమేశ్వరమ్మ, ఎస్‌కే మొబీనాబేగం, జరీనా బేగం, హసీనా బేగం ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 30, 31వ తేదీల్లో విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో రాష్ట్ర రెజ్లింగ్‌ కోచ్‌ రత్నరాజు, అసోసియేషన్‌ కోశాధికారి మద్దం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని