అమ్మ ఆశయం కోసం దుఃఖాన్ని దిగమింగి..!
eenadu telugu news
Updated : 16/09/2021 13:11 IST

అమ్మ ఆశయం కోసం దుఃఖాన్ని దిగమింగి..!

తల్లి, చెల్లిని ప్రమాదంలో కోల్పోయినా పరీక్ష రాసిన విద్యార్థిని


మామయ్య షేక్‌ షబ్బీర్‌తో కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చిన ఆయేషా

తెనాలి టౌన్‌: న్యూస్‌టుడే: స్థానిక మార్కెట్‌యార్డులో మంగళవారం జరిగిన ప్రమాదంలో తల్లి, చెల్లిని కోల్పోయిన ఆయేషా ఇంటర్‌ పరీక్ష రాయడానికి పట్టణంలోని కేంద్రానికి బుధవారం వచ్చి పరీక్ష రాసింది. తాను డాక్టర్‌ కావాలన్నది అమ్మ ఆశయమని, ఆమె కోసమే పరీక్ష రాయడానికి వచ్చానంటూ వణుకుతున్న కంఠంతో ఆమె చెప్పింది. కాగా మంగళవారం నాటి ప్రమాదంలో మృతిచెందిన తల్లి, కుమార్తె మృతదేహాలకు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించి, బుధవారం బంధువులకు అప్పగించారు. భర్త స్వగ్రామమైన సుద్దపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయేషా పరీక్ష రాయడానికి బయలుదేరే సమయానికి (ఉదయం 9 గంటలకు) మృతదేహాలు వైద్యశాలలోనే ఉన్నాయి. పరీక్ష అనంతరం ఆమెను మామయ్య షబ్బీర్‌ అంత్యక్రియలు నిర్వహిస్తున్న సుద్దపల్లి గ్రామానికి తోడ్కోని వెళ్లారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని