రక్షణ గోడ కట్టారు...
eenadu telugu news
Published : 16/09/2021 03:01 IST

రక్షణ గోడ కట్టారు...

జాతీయ రహదారిపై డివైడర్ల మధ్యలో పెరిగిన గడ్డి, పిచ్చిమొక్కలు తొలగించడం, డివైడర్లకు రంగులు వేయడం, నీళ్లు పోయడం ఇలా నిర్వహణ పనులలో నిత్యం ఎంతో మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు. తరచూ వేగంగా వచ్చే వాహనాలు ఢీ కొనడంతో వీరు ప్రమాదాలకు గురికావడమే కాకుండా, ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. దీంతో జాతీయ రహదారి నిర్వహణలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు పరిచేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంతో ఇదిగో ఇలా పనిచేసేవారికన్నా అర కిలోమీటరు దూరం నుంచే ఎర్రటి కోన్‌ల సహాయంతో ఇరువైపులా రక్షణ గోడ కట్టి, మధ్యలో రేడియం డ్రెస్‌ వేసిన ఒక బొమ్మను నిలబెట్టి, పనిచేసేవారి ప్రాణాలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం మండలం దొనబండ సమీపంలో కనిపించిన దృశ్యాలివి.

-ఈనాడు, అమరావతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని