ఆపేవారెవరు... అడిగేవారెవరు
eenadu telugu news
Published : 31/07/2021 06:24 IST

ఆపేవారెవరు... అడిగేవారెవరు

జాతీయ రహదారిపై తాడేపల్లి వద్ద నిలిపేసిన వాహనాలు

జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలుపరాదు. తాడేపల్లిలో విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే రహదారి పక్కనే వాహనాలు పెద్దఎత్తున నిలిపి ఉంచుతున్నా అడిగేవారేలేరు. వీటి వల్ల ప్రమాదాలు సైతం జరిగే అవకాశాలు ఎక్కువ. మరోవైపు జాతీయ రహదారిపైకి పశువులు రాకుండా ఇనుప కంచె వేశారు. అయితే కొందరు కంచెలను నాశనం చేసి పశువులను జాతీయ రహదారిపైకి మేతకు వదలడం, తీసుకువెళ్లడం చేస్తున్నారు. వీటివల్ల అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు. విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై కనిపించిన దృశ్యాలివి.

-ఈనాడు, అమరావతి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని