డిప్యూటీ మేయర్‌- 2గా షేక్‌ సజిలా ఎన్నిక
eenadu telugu news
Published : 31/07/2021 06:24 IST

డిప్యూటీ మేయర్‌- 2గా షేక్‌ సజిలా ఎన్నిక

షేక్‌ సజిలాకు ఎన్నిక ధ్రువపత్రం ఇస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, చిత్రంలో మేయర్‌ మనోహర్‌, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌, కమిషనర్‌ అనురాధ, డిప్యూటీ మేయర్‌ వజ్రబాబు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు నగరపాలకసంస్థ (జీఎంసీ) డిప్యూటీ మేయర్‌- 2గా 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ సజిలా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జీఎంసీ కౌన్సిల్‌ హాల్‌లో ఎన్నిక నిర్వహించగా ఆమె ఎన్నికైనట్లు జిల్లా పాలనాధికారి, ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ ప్రటించారు. డిప్యూటీ మేయర్‌- 2 ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎవరూ హాజరుకాలేదు. షేక్‌ సజిలా నామినేషన్‌ వేయగా, వైకాపా కార్పొరేటర్‌ ఈచంపాటి వెంకటకృష్ణ ప్రతిపాదించారు. వైకాపా కార్పొరేటర్లు అబీద్‌బాష, అంబేద్కర్‌, ఖాజా మొహిద్దీన్‌ చిష్టి, మహమ్మద్‌ తదితరులు బలపరిచారు. ఇంకా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో సజిలా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రకటించి ధ్రువపత్రం అందజేశారు. అనంతరం మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా షేక్‌ సజిలాను మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, మేయర్‌ మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌, కమిషనర్‌ అనురాధ, డిప్యూటీ మేయర్‌-1 వనమా బాలవజ్రబాబు, కార్పొరేటర్లు, అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ నగరాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులందరం సమన్వయంతో పని చేస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని