ఇంటి పంట ఆరోగ్యరక్ష
eenadu telugu news
Published : 31/07/2021 06:01 IST

ఇంటి పంట ఆరోగ్యరక్ష

ఇంటి పంటలకు సేంద్రియ ఎరువుల వాడకంతోనే అధిక ప్రయోజనం ఉంటుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఎరువుల అందుబాటు తక్కువే. కొన్ని ప్రయివేట్‌ నర్సరీల్లో, విత్తనాలు అమ్మే దుకాణాల్లో వర్మీకంపోస్టును విక్రయిస్తున్నారు. మొక్కల పెంపకం చేపట్టే ఔత్సాహికులు కొద్దిపాటి శ్రమ, సమయాలను వెచ్చించి సొంతంగా నాణ్యమైన ఎరువును తయారు చేసుకోవచ్ఛు ఇలా తయారుచేసే ఎరువునే కంపోస్టు అని కూడా అంటారు. ఇందుకోసం 100-200 లీటర్ల పరిమాణం ఉన్న పాత ప్లాస్టిక్‌ డ్రమ్మును ఉపయోగించాలి. ఈ డ్రమ్ము చుట్టూ నిర్ణీత ఎడంగా రంధ్రాలు చేయాలి. అడుగున చేయకూడదు. పెరడులో లేదా టెర్రస్‌పైన ఒక మూలన ఈ డ్రమ్మును ఏర్పాటు చేసుకోవాలి. తోటలో రాలిన ఆకులు, వంటింటి వ్యర్థాలు, కుళ్లిపోయే స్వభావమున్న ఏ పదార్థాలనైనా డ్రమ్ములో వేయవచ్ఛు అర అడుగు మందంలో వ్యర్థాలను వేసిన తర్వాత దోసెడు మట్టిని పలుచగా చల్లి నీరు చిలకరించాలి. ఇలా డ్రమ్ము నిండేంత వరకు (సుమారు 1-2 నెలల వ్యవధిలో) పొరలు పొరలుగా వ్యర్థాలు, మట్టిని వేస్తుండాలి. సుమారు వారానికోసారి తేలికపాటుగా నీరు చల్లుతుండాలి. పైన మూత వదులుగా పెట్టి డ్రమ్మును ఎండలో పెడితే సుమారు ఆరు నెలల్లో కంపోస్టు తయారవుతుంది. తయారైన కంపోస్టు తేలికగా, చెడు వాసన లేకుండా ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని