అన్ని కేడర్ల ఉద్యోగులను కొనసాగించాలి
eenadu telugu news
Published : 31/07/2021 04:28 IST

అన్ని కేడర్ల ఉద్యోగులను కొనసాగించాలి

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులను కొనసాగించాలని అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల పొరుగు సేవల ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులంతా కలిసి ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఐకాస సెక్రటరీ జనరల్‌ ఎం.బాలకాశి, ప్రభుత్వ రంగ సంస్థల ఒప్పంద ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి నూర్‌ మహమ్మద్‌, రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జేఏసీ కార్యదర్శి కె.విజయ్‌, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఒప్పంద కార్మికుల సంఘం నాయకుడు ఎ.మోహన్‌రెడ్డి, పట్టణ ఆరోగ్య కేంద్రాల పొరుగు సేవల సిబ్బంది సంఘం అధ్యక్షురాలు బి.జగతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని