వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఈ-బైక్‌
logo
Published : 23/06/2021 06:12 IST

వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఈ-బైక్‌

కేఎల్‌యూ విద్యార్థుల రూపకల్పన


బైక్‌తో రూపకర్తలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: కేఎల్‌యూలో మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న ఈఈఈ విద్యార్థులు ఈ-బైక్‌ (విద్యుత్తు ద్విచక్ర వాహనం)తో పాటు వైర్లెస్‌ ఛార్జింగ్‌ పరికరాన్ని రూపొందించారని ఆ విభాగం అధిపతి డాక్టర్‌ సోమ్‌లాల్‌ మంగళవారం తెలిపారు. దీన్ని స్టార్టప్‌గా ఇన్‌క్యూబేట్‌ చేయడానికి కేఎల్‌యూ రూ.1.40 లక్షలు విద్యార్థుల బృందానికి అందించిందన్నారు. ఈ-బైక్‌ను 5 గంటలు ఛార్జింగ్‌ చేస్తే గంటకు 55 కి.మీ. వేగంతో ప్రామాణిక పరిస్థితిలో 85 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఓ పాత బైక్‌ను తీసుకొని తమ నమూనాకు అనుగుణంగా మార్పులు చేసి, వైర్లెస్‌ ఛార్జింగ్‌తో ఈ-బైక్‌ను రూపొందించారన్నారు. వైర్లెస్‌ ఛార్జబుల్‌ ఈ-బైక్‌ ప్రాజెక్టును పూర్తిచేయడం తమకు గర్వంగా ఉందని బీటెక్‌ చివరి ఏడాది విద్యార్థి సత్యవర్థ ప్రవషిక్‌ అన్నారు. తనతో పాటు చరణ్‌సాయి, సందీప్‌, కిరీటి, లోకేశ్‌బాబు, సాయిప్రవీణ్‌, పూర్వ విద్యార్థి యశ్వంత్‌సాయి ఈ ప్రాజెక్టులో భాగమైనట్లు చెప్పారు. విద్యార్థులు రూపొందించిన ఈ-బైక్‌ ప్రాజెక్టు వారి సృజనాత్మకతకు దర్పణం పడుతోందని కేఎల్‌యూ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అన్నారు. వినూత్న ఆలోచనలు, సాంకేతికతతో తమ విద్యార్థులు ముందుకు సాగుతుండడం గర్వకారణంగా ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని