2.10 లక్షల మందికి రెండో విడత చేయూత
logo
Published : 23/06/2021 06:12 IST

2.10 లక్షల మందికి రెండో విడత చేయూత

మహిళలకు చెక్కును అందజేస్తున్న హోంమంత్రి సుచరిత, ఉప సభాపతి రఘుపతి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ప్రజాప్రతినిధులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో 2,10,529 మందికి రెండో విడత చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు రూ.18,750 వారి ఖాతాల్లో జమ చేశారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి తెలిపారు. రెండో విడత చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ప్రారంభించారు. గుంటూరు కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌తో పాటు, హోంమంత్రి మేకతోటి సుచరిత, ఉపసభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా ఆదాయం పెంచుకుని మహిళలు ఆర్థికంగా స్థిరపడటం కోసం పాడిపరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం, చిరువ్యాపారాలు నిర్వహించుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నారన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించి నిజమైన మహిళా సాధికారతను సీఎం చేసి చూపించారన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులైన మహిళలకు పెన్షన్‌ ఇస్తూనే వైఎస్సార్‌ చేయూత ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. వీసీలో ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌, ముస్తఫా, మేరుగ నాగార్జున, నంబూరు శంకరరావు, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, జేసీ కె.శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో కొండయ్య, గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, ఉపాధి కల్పనాధికారి దుర్గాభాయ్‌, అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని